Hyderabad : పిల్లి దొరికింది...

Hyderabad : పిల్లి దొరికింది...
అపహరణకు గురైన ఖావ్‌మానీ జాతికి చెందిన అరుదైన పిల్లి; యజమానికి అప్పజెప్పిన పోలీసులు

హైదరాబాద్‌ వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం సాయంత్రం అరుదైన జాతికి చెందిన పిల్లిని గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించిన సంగతి తెలిసిందే. అయితే 24గంటలు గడవక ముందే పోలీసులు ీ కేసును ఛేధించారు.


తను పెంచుకుంటున్న పిల్లిపోయిందని హుస్సేన్‌ మహమద్‌ అనే వ్యక్తి మంగళవారం వనస్థలిపురం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ వార్త కాస్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయింది. తాజాగా పిల్లిని తీసుకుపోయిన వ్యక్తిని అరెస్ట్ చేయడంత సదరు పిల్లి పోలీసుల చెంతకు చేరింది. మార్జాలాన్ని యజమాని అయిన హుస్సేన్‌కు అప్పగించారు. అయితే ఆ పిల్లి దారితప్పి ఇబ్బంది పడుతుండగా దానిని రక్షించడానికే తాను ఆ పిల్లిని తీసుకెళ్లానని, అది కాస్త వైరల్‌ కావడంతో దాని ఆచూకి తెలిసి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారని పిల్లిని అపహరించిన వ్యక్తి చెప్పడం గమనార్హం.


ఆ అరుదైన పిల్లి ఖావ్‌ మానీ సంతతికి చెందినది, దానిని డైమండ్‌ ఐస్‌ పిల్లి అని కూడా అంటారు. థాయిలాండ్ లో రూ.50 వేలకు పిల్లిని కొనుగోలు చేసి తెచ్చుకున్నట్లు యజమాని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story