Hyderabad : మలక్ పేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం..!

ప్రభుత్వ హాస్పిటల్ కు చికిత్సకు వెళ్లిన ఇద్దరు బాలింతలు మృతిచెందారు. ఈ ఘటన హైదరాబాద్ మలక్ పేట్ ప్రభుత్వ హాస్పిటల్ లో జరిగింది. డాక్టర్ల నిర్లక్షమే గర్బిణీల మృతికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్ ముందు మృతుల బందువులు ఆందోళన చేపట్టారు.
హైదరాబాద్ కు చెందిన శివాని అనే గర్భిణీని 10 తేదీ మధ్యహ్నం ఆస్పత్రికి డెలివరీ కోసం తీసుకొచ్చారు. ఆమెకు 11వ తేధీ మధ్యాహ్నం కాన్పు చేశారు. అయితే 12వ తేదీ రాత్రి.. శివాని అస్వస్థతకు గురవడంతో సివిల్ సర్జన్ సూచన మేరకు ఆమెను గాంధీ హాస్పిటల్ కు తరలించారు. దీంతో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం శివాని మృతి చెందింది. మలక్ పేట్ డాక్టర్లు సరైన టెస్టులు చేయకుండా శివానికి ఆపరేషన్ చేశారని మృతురాలి బందువులు ఆరోపిస్తున్నారు.
నాగర్ కర్నల్ కు జిల్లా వెల్దండ గ్రామానికి చెందిన మహేష్ తన భార్య సిరివెన్నెలతో కలిసి హైదరాబాద్ లో నివసిస్తున్నాడు. కారు డ్రైవర్ గా పనిచేస్తున్న మహేష్ తన భార్యను కాన్పుకోసం మలక్ పేట ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకొచ్చారు. ఆపరేషన్ చేయగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం సిరివెన్నెల అస్వస్థతకు లోనవడంతో గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ సిరివెన్నెల కన్నుమూసింది. మలక్ పేట వైద్యుల నిర్లక్ష్యంతోనే సిరి వెన్నెల చనిపోయిందని మృతురాలి బందువులు హాస్పిటల్ ముందు ధర్నా చేస్తున్నారు.
వైద్యుల నిర్లక్ష్యం లేదు : డీసీహెచ్ ఎస్ సునిత
బాలింతల మృతి విషయంలో వైద్యుల నిర్లక్ష్యం లేదని డీసీహెచ్ ఎస్ సునిత తెలిపారు. బాలింతలు హాస్పిటల్ కు రాగానే అన్నిపరీక్షలు చేసిన తర్వాతనే డాక్టర్లు ఆపరేషన్ చేశారని చెప్పారు. సిరివెన్నెల రెండో కాన్పుకోసం వచ్చిందని... కాన్పుకంటే ముందు చేసిన పరీక్షల్లో ఎలాంటి లోపాలు కనిపించలేదని సునిత తెలిపారు.
మరో మృతురాలు శివాని డయేరియాతో బాధపడతుందని అన్నారు సునిత. దీంతో పాటు హైపోథైరాయిడ్ సమస్య ఉందని.. ఆపరేషన్ చేయడం, హైరిస్క్ అని శివాని బందువులకు ముందే చెప్పినట్లు తెలిపారు. అయితే 11వతేదీ మధ్యాహ్నం నొప్పులు వస్తున్నయని చెప్పడంతో సర్జన్ అభిప్రాయం మేరకు గాంధీకి తరలించినట్లు తెలిపారు. అయితే ఆమె గాంధీలో చికిత్స పొందుతూ మృతిచెందిందని అన్నారు. బాలింతల మృతిలో డాక్టర్ల పాత్రలేదని... ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు ఒక కమిషనర్ ను నియమించినట్లు సునిత తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com