Hyderabad: పతంగులపై ఆంక్షలు..!

Hyderabad: పతంగులపై ఆంక్షలు..!
ఆ ప్రాంతాల్లో పతంగలు ఎగరేస్తే అంతే సంగతులు...సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులపై ఆంక్షలు పెట్టారు పోలీసులు. సిటీ పోలీస్ కమిషనర్ సీ.వీ ఆనంద్ మాట్లాడుతూ... ప్రార్థనా స్థలాలవద్ద గాలిపటాలు ఎగరవేయొద్దని తెలిపారు. జనవరి14 నుంచి 16 వరకు ఆంక్షలు ఉండనున్నట్లు చెప్పారు. శాంతి భద్రతలతో పాటు, ప్రమాదాలు జరగకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

పోలీసుల అనుమతి లేనిదే లౌడ్ స్పీకర్లు, DJలను పబ్లిక్ ప్లేస్ లలో పెట్టకూడదని సీ.వీ ఆనంద్ తెలిపారు. పిట్టగోడలు లేని మిద్దెలపై పిల్లలు గాలిపటాలు ఎగురవేయకుండా తల్లిదండ్రులు జగ్రత్తపడాలని సూచించారు.

Next Story