Hyderabad: మెట్రోలో సాంకేతికలోపం
అమీర్‌పేట-రాయదుర్గం రూట్‌లో అంతరాయం

రాజధానిలో ట్రాఫిక్ కష్టాన్ని తప్పించుకోవడం కోసం ప్రజలు మెట్రోవైపు ఎక్కువ మెగ్గుచూపుతున్నారు.దీంతో కార్యాలయాల వేళల్లో మెట్రోలో కూడా రద్దీ విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా అమీర్‌పేట-రాయదుర్గం మార్గంలో స్టేషన్‌లో ప్రయాణీకులు నిత్యం కిక్కిరిసిపోతున్నారు. ఈ క్రమంలోనే ఒక్కోసారి మెట్రోను సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి.
అమీర్‌పేట-రాయదుర్గం మెట్రో రైల్ రూట్‌లో మంగళవారం సాంకేతికలోపం ఏర్పడింది. దాంతో రాయదుర్గం, అమీర్‌పేట మధ్య అప్ అండ్ డౌన్ ట్రైన్లు నడుపుతోంది మెట్రో యాజమాన్యం. ఒకే రూట్ నుంచి నడపడంతో రైళ్ల రాకపోకల్లో తీవ్ర ఆలస్యం ఏర్పడుతోంది. ప్రయాణికులకు సరైన సమాచారం లేకపోవడంతో మెట్రో స్టేషన్లలో ఎదురు చూస్తూ ఇబ్బంది పడుతున్నారు.
Next Story