Hyderabad: రేపే డెక్కన్‌ మాల్‌ కూల్చివేత

Hyderabad: రేపే డెక్కన్‌ మాల్‌ కూల్చివేత
టెండర్‌ దక్కించుకున్న హైదరాబాదీ కంపెనీ

సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదానికి గురైన డెక్కన్ మాల్ కూల్చివేత పనులు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. భవనాన్ని కూల్చేందుకు జీహెచ్‌ఎంసీ టెండర్లను ఆహ్వానించింది. దీంతో హైదరాబాద్‌కు చెందిన కంపెనీ కూల్చివేతకు టెండర్ దక్కించుకుంది. ఆరు ఫోర్లలో 1890 చదరపు అడుగుల్లో ఉన్న భవనం కూల్చివేతకు 33 లక్షల విలువైన టెండర్‌ను వేణుగోపాల్ దక్కించుకున్నారు. అయితే రెండు రోజుల్లో కూల్చివేత ప్రక్రియ ముగించాలని జీహెచ్‌ఎంసీ షరతులు విధించింది. కూల్చివేత సమయంలో చుట్టుపక్కల నివాసాలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా అధునాతన యంత్రాలను ఉపయోగించనున్నారు. ఈ ప్రక్రియలో 20 వేల టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story