Hyderabad: కరెంట్ కట్‌ చేసి... పేకాటరాయుళ్లను తప్పించి...

Hyderabad: కరెంట్ కట్‌ చేసి... పేకాటరాయుళ్లను తప్పించి...
పీర్జాదిగూడ మున్సిపాలిటీ మేడిపల్లిలో పేకాట స్థావరం వద్ద పోలీసుల హైడ్రామా

పీర్జాదిగూడ మున్సిపాలిటీ మేడిపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి సమయంలో హైడ్రామా చోటు చేసుకుంది. పర్వత్‌ నగర్‌లో కోఆప్షన్‌ మెంబర్‌ జగదీశ్వర్‌ రెడ్డి కార్యాలయంలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట నిర్వహిస్తుండగా మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. జగదీశ్వర్‌ రెడ్డితో పాటు పీర్జాదిగూడ డిప్యూటీ మేయర్‌ కుర్రా శివకుమార్‌ గౌడ్‌తో, ఏడుగురు కార్పోరేటర్ల భర్తలు, ఆరుగురు బిల్డర్లు ఉన్నట్లు సమాచారం. అయితే పోలీసులు వచ్చిన సంగతి తెలుకుని వీరంతా తలుపు తెరవకుండా ఇబ్బంది పెట్టారు. దీంతో బలవంతంగా పోలీసులు లోపలికి చొచ్చుకుపోయారు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో దాడి చేసిన పోలీసులు లోపలికి వెళ్లగా 11.30 గంటల వరకు బయటికి రాలేదు. చివరికి హైడ్రామా మధ్య ప్రజాప్రతినిధుల్ని పోలీసులు తప్పించినట్లు ప్రచారం జరిగింది. దాదాపు 4 గంటల పాటు కరెంట్ సరఫరా నిలిపేసి పేకాట ఆడుతున్న ప్రజాప్రతినిధులు తప్పించినట్లు తెలుస్తోంది. కవర్ చేస్తున్న మీడియా పై దాడి చేశారు. కెమెరాలు లాక్కొని దౌర్జన్యం చేశారు. వీరిని తప్పించేందుకు ఓ మంత్రి సైతం ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పిర్జాదిగూడ డిప్యూటీ మేయర్‌తో పాటు ఆరుగు కార్పొరేటర్ల భర్తలు, కొంతమంది కార్పొరేటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు . అయితే..ఈ కేసు వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు. పేకాయరాయుళ్ల వివరాలు చెప్పేందుకు పోలీసులు నిరాకరించారు. నోటీసుల ఇచ్చి పంపించినట్లు తెలుస్తోంది. రాజకీయ అవసరాల కోసం పేకాట కేసును ఉపయోగించుకున్నట్లు ఓ కీలక నేత ఆరోపణలు చేశారు. పిర్జాదీగూడ మేయర్‌ విషయంలో ఇటీవల అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కార్పొరేటర్లు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసుల దాడి జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags

Next Story