Hyderabad : తాగునీటి సరఫరాకు అంతరాయం

Hyderabad : తాగునీటి సరఫరాకు అంతరాయం
X
ఫ్రిబ్రవరి 4, 5 తేదీల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు అధికారులు తెలిపారు

హైదరాబాద్ లో తాగునీటికి అంతరాయం ఏర్పడనుంది. ఫ్రిబ్రవరి 4, 5 తేదీల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, మురుగునీటి బోర్డు కలిసి మరమ్మత్తుల పనులు చేపడుతుండటంతో, నగరంలోని చాలా చోట్ల 30గంటలు, తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్-2కి సంబంధించిన 1600 ఎంఎం డయా పైప్ లైన్ మరమ్మత్తులు జరుగుతున్నాయి.


బైరామల్ గూడ జంక్షన్ లో ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎలాంటి ఆటంకం కలగకుండా మరమ్మత్తులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 4వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 12గంటల వరకు బాలాపూర్, మేకల మండి, మారేడ్ పల్లి, తార్నాక, లాలాపేట్, బుద్దనగర్, హస్మత్ నగర్, ఫిరోజ్ గూడ, భోలక్ పూర్ తదితర ప్రాంతాల్లో తాగునీటికి అంతరాయం ఏర్పడనున్నట్లు అధికారులు తెలిపారు. గత 10రోజుల్లో ఇది రెండోసారని స్థానికులు వాపోతున్నారు.

జనవరి 27న శాస్త్రీపురం, బండ్లగూడ, గంధం గూడ, ధర్మసాయి, భోజగుట్ట, అల్లబండ, మధుబన్, దుర్గానగర్, బద్వేల్, సులేమాన్ నగర్, గోల్డెన్ హైట్స్, 9, కిస్మత్ పూర్, తదితర ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని ముందుగానే సమాచారాన్ని ఇచ్చారు అధికారులు.

Tags

Next Story