Hyderabad: నకిలీ నోట్ల హల్ చల్

Hyderabad: నకిలీ నోట్ల హల్ చల్
నకిలీ నోట్ల తయారీ; నలుగు రాజస్థానీ కుర్రాళ్ల అరెస్ట్..

హైదరాబాద్ నగరంలో నకిలీ నోట్ల ముద్రిస్తున్న గ్యాంగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కమిషనర్ టాస్క్ ఫోర్స్, నాంపల్లి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన మెరుపు దాడిలో 4 నిందితులు పట్టుబడ్డారు. నకిలీ నోట్లను ముద్రిస్తూ ప్రజలను మోసగిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు పక్కా ప్రణాళికతో నిందితులను అరెస్ట్ చేశారు. రాజస్థాన్ కు చెందిన కన్నయ్యలాల్ అలియాస్ జతిన్, రామావతార్ శర్మా అలియాస్ మోహన్, భరత్ కుమార్, రామ్ కిషన్ లను అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరు గతంలోనూ పలు కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. వీరి వద్ద నుంచి సుమారు రూ.72.50 లక్షలు సీజ్ చేసినట్లు తెలిపారు. కోల్ కతాలో స్లైడింగ్ విండో వ్యాపారం చేసే కన్నయ్యలాల్, ఇందుకోసం తెలిసిన వారి దగ్గర నుంచి అప్పులు తీసుకుని కొద్ది రోజుల్లోనే మళ్లీ తిరిగి ఇచ్చేసేవాడు. అయితే వ్యాపారం ఆశాజనకంగా సాగకపోవడంతో తనను నమ్మి అప్పు ఇచ్చిన వారిని మోసం చేసేందుకు సిద్ధమయ్యాడు. నకిలీ కరెన్సీ ముద్రించడం ప్రారంభించాడు. మిగతా ముగ్గురితో కలసి నోట్లను ముద్రిస్తూ చివరకి పోలీసులకు చిక్కాడు.

Tags

Read MoreRead Less
Next Story