Hyderabad: "బిలో ది బెల్ట్" లో ఏముంది?

Hyderabad: బిలో ది బెల్ట్ లో ఏముంది?
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన 'బిలో ది బెల్ట్' డాక్యుమెంటరీ; ఎండోమెట్రియోసిస్ పై అవహాగనా చిత్రం; ప్రతి 10 మంది మహిళల్లో ఒకరికి ఎండోమెట్రియోసిస్...

'ఎండోమెట్రియోసిస్...' దేశంలో ఎంతో మంది మహిళలకు ఈ పదం సుపరిచితం కావచ్చు. అయితే దాన్ని ఇప్పటివరకూ ఎవరూ సీరియస్ గా తీసుకోలేదనే చెప్పాలి. కానీ, చాపకింద నీరులా మహిళల ఆరోగ్యాన్ని కబళిస్తోంది ఈ మహమ్మారి. భారతదేశంలో 2.5 కోట్ల మహిళలు ఎండోమెట్రియోసిస్ తో బాధపడుతున్నారు. మహిళల్లో సంతానోత్పత్తి తగ్గడానికి ఇదే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. దేశంలో ప్రతి పది మంది మహిళల్లో ఒకరు ఈ వ్యాధితో బాధపుడుతున్నారు. 30 నుంచి 50శాతం మహిళలు ఎండోమెట్రియోసిస్ కారణంగానే గర్భం ధరించలేకపోతున్నారు. 35ఏళ్లు పైబడిన వారిలో గర్భస్రావాలకు ఇదే ప్రధాన కారణమని చెప్పవచ్చు. కేవలం అవగాహనా లోపం వల్ల ఈ వ్యాధి అంతకంతకూ విస్తరిస్తోంది అనడంలో సందేహమేలేదు. అలాంటి ఈ మహమ్మారిపై మహిళలను చైతన్యపరిచే ఉద్దేశంతో రూపొందిన డాక్యుమెంటరీనే 'బిలో ది బెల్ట్'. అంతర్జాతీయంగా ఎన్నో ప్రసంశలు అందుకున్న ఈ డాక్యుమెంటరీ తాజాగా హైదరాబాద్ లోనూ స్క్రీనింగ్ అవ్వబోతోంది.

ఈ సందర్భంగా భారత ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ విమీ బింద్రా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాధిపై మరింత అవగాహన కల్పించారు. పెల్విస్, పొత్తికడుపు, బ్లాడర్, డయాఫ్రమ్ వంటి ప్రాంతాల్లో యుటెరస్ వెలుపల అదనంగా ఎదిగే కణజాలమే ఈ పరిస్థితికి కారమవుతుందని డాక్టర్ బింద్రా తెలిపారు. కొన్నిసార్లు బ్రెయిన్ లోనూ ఈ రకమైన టిష్యూలు పెరిగే అవకాశముందని అన్నారు. దీని వల్ల తీవ్రమైన నొప్పి, పిల్లలు కలగకపోవడంతో పాటూ ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వెల్లడించారు. అయితే ఈ వ్యాధి పై మహిళల్లో అవగాహన పెంపొందించేందుకు 'బిలో ది బెల్ట్' రూపొందించినట్లు తెలిపారు. మార్చ్ 3వ తారీఖున హైదరాబాద్ లో ఈ డాక్యుమెంటరీని మారిగోల్డ్ హాటల్ లో ప్రదర్శించబోతున్నారని తెలుస్తోంది. 16ఏళ్ల వయసులోనే ఈ వ్యాధి బారి పడిన షానన్ క్హోన్ ఏళ్ల తరబడి ట్రీట్మెంట్ పొంది పూర్తిగా కోలుకున్న అనంతరం డాక్యుమెంటరీకి శ్రీకారం చుట్టారు. షానన్ స్వీయ అనుభవాల్లో నుంచి పుట్టుకువచ్చిన ఈ డాక్యుమెంటరీ స్క్రీనింగ్ అనంతరం, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్య బృందంతో ముఖాముఖి కూడా ఏర్పటు చేయనున్నట్లు డాక్టర్ బింద్రా తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story