Hyderabad: మైనర్‌పై సామూహిక అత్యాచారం

Hyderabad: మైనర్‌పై సామూహిక అత్యాచారం
మెడికల్ షాప్‌కు వెళ్లిన బాలికను ట్రాప్‌ చేసి గంజాయి మత్తులో ఉన్నవారికి అప్పగించిన మహిళ

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో చోటుచేసుకుంది. మద్యం తాగించి ఆ తర్వాత బాలిక పై అఘాయిత్యానికి పాల్పడ్డారు. మెడికల్ షాప్‌కు వెళ్లిన బాలికను ఓ మహిళ ట్రాప్ చేసింది. తక్కువ ధరకు మందులు ఇప్పిస్తానని ఓ మహిళ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లింది. తర్వాత గంజాయి మత్తులో ఉన్న యువకులకు అప్పగించింది. ఆమెను గదిలో బంధించిన యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

బాలిక ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డ అయిదుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికకి మద్యం తాగించి నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. గంజాయి మత్తులో బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Tags

Next Story