Hyderabad: హార్టికల్చర్‌ కాలేజ్‌ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు

Hyderabad: హార్టికల్చర్‌ కాలేజ్‌ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు
ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని ఆగ్రహం

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ హార్టికల్చర్‌ కాలేజ్‌ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గురువారం ప్రిన్సిపాల్‌ రూమ్‌కు విద్యార్థులు తాళం వేశారు. HEO కోసం జీవో విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు కాలేజ్‌ నుంచి విద్యార్థులు వెళ్లిపోవాలని ప్రిన్సిపాల్‌ హుకుం జారీ చేశారంటూ స్టూడెంట్స్ మండిపడుతున్నారు. ప్రిన్సిపాల్ ఆదేశాలతో మెస్ అండ్‌ హాస్టల్‌కి సిబ్బంది తాళాలు వేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజ్‌ దగ్గరకు చేరుకుని విద్యా ర్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

Tags

Next Story