Hyderabad: లుంబినీ పార్క్‌లో ఫ్లోటింగ్‌ మ్యూజికల్‌ ఫౌంటెన్‌

Hyderabad: లుంబినీ పార్క్‌లో ఫ్లోటింగ్‌ మ్యూజికల్‌ ఫౌంటెన్‌
X
17.2 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఫౌంటెన్‌ను ప్రారంభించిన మంత్రులు

హైదరాబాద్‌ నగరవాసులను ఆహ్లాదపరిచేందుకు హుస్సేన్‌సాగర్‌, లుంబినీ పార్క్‌ దగ్గర ఫ్లోటింగ్‌ మ్యూజికల్‌ ఫౌంటెన్‌ ప్రారంభమైంది. 17.2 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఫౌంటెన్‌ ను మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌ అలీ, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ గురువారం ప్రారంభించారు. 180 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 90మీటర్ల ఎత్తుతో హెచ్‌ఎండీఏ రూపొందించిన ఫ్లోటింగ్‌ మ్యూజికల్‌ ఫౌంటెన్‌ ఢిపరెంట్‌ థీమ్‌లతో ఫెయిరీ ఫాగ్‌, క్లౌడ్‌ ఎఫెక్ట్‌ను సృష్టిస్తుంది. దీంతో అద్భుత వాతావరణంలో ఆహ్లాదకరంగా సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. ఈ ఫౌంటెన్‌ షో ప్రతి రోజూ రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు జరుగుతుంది. వీకెండ్‌, హాలిడేస్‌లో నాలుగు షోలు ఉండనున్నాయి.

Tags

Next Story