Hyderabad: నెక్లెస్ రోడ్డులో రయ్యి.. రయ్యిమంటూ ఈ-రేసింగ్‌

Hyderabad: నెక్లెస్ రోడ్డులో రయ్యి.. రయ్యిమంటూ ఈ-రేసింగ్‌
2.8 కిలో మీర్ల స్ట్రీట్ సర్క్యూట్‌లో పాల్గొంటున్న 11 ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన 22 మంది రేసర్లు

హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ప్రపంచ ఈ - కార్ రేసింగ్ ప్రారంభమయింది. 2.8 కిలో మీర్ల స్ట్రీట్ సర్క్యూట్‌లో 11 ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన 22 మంది రేసర్లు రేస్‌లో పాల్గొన్నారు. ఈ రేస్‌ను 21 వేల మంది వీక్షించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ చూసేందుకు నెక్లెస్ రోడ్డుకు నగరవాసులు భారీగా తరలివచ్చారు. వీరితోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. సినీ నటులు రాంచరణ్, నాగార్జున, మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు, ఎమ్మెల్సీ కవిత కుమారుడు, సినీనటుడు మహేష్ బాబు కుమారుడు గౌతమ్ రేసింగ్ చూసేందుకు నెక్లెస్ రోడ్డుకు చేరుకున్నారు. క్రికెటర్లు సచిన్, శిఖర్ ధావన్, యజువేంద్ర చాహల్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ రేసును తిలకిస్తున్నారు. మంత్రులు పువ్వాడ అజయ్, జగదీశ్వర్ రెడ్డి కూడా రేసింగ్ వీక్షిస్తున్నారు.

ఫార్ములా ఈ ప్రపంచ ఛాంపియన్ షిప్‌కు హైదరబాద్ వేదిక కావడం గర్వకారణంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. ప్రపంచం మొత్తం ఇపుడు హైదరాబాద్ వైపు చూస్తోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రముఖ నగరాలతో పోటీపడి హైదరాబాద్ ఫార్ములా రేసింగ్ ఛాన్స్ దక్కించుకుందన్నారు. ఈ సందర్భంగా వివిధ దేశాల నుంచి వచ్చిన రేసర్లకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.

320 కిలో మీటర్ల వేగంతో దూసుకెళుతున్న కార్లను చూసి ప్రేక్షకులు చప్పట్లు , కేరింతలు కొడుతున్నారు. మరోవైపు రేసింగ్ వీక్షించేందుకు వచ్చిన వారు సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. రేస్ డ్రైవర్ల ఆటోగ్రాఫ్ తీసుకునేందుకు ఇంటరాక్టివ్ సెషన్‌ ను ఏర్పాటు చేశారు. దీంతో తమకు నచ్చిన డ్రైవర్లతో ఫొటోలు దిగేందుకు అభిమానులు వందల సంఖ్యలో బారులు తీరారు.

Tags

Read MoreRead Less
Next Story