Hyderabad: నకీలీ ఆయుర్వేదం వైద్యం; ముగ్గురి అరెస్ట్

Hyderabad: నకీలీ ఆయుర్వేదం వైద్యం; ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్ లో నకిలీ ఆయుర్వేద క్లీనిక్ గుట్టురట్టు; అమీర్ పేట్ లో ఆకస్మిక దాడి; ముగ్గురి అరెస్ట్

హైదరాబాద్ లో పోలీసులు నకిలీ ఆయుర్వేద క్లీనిక్ గుట్టు రట్టు చేశారు. అమీర్ పేట్ లో మెరీడియన్ ప్లాజాలో ఉన్న తులసి ఆయుర్వేద సెంటర్ పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. లైసెన్స్ లేకుండానే, సరైన అర్హతలేని వైద్యులతో ఈ క్లీనిక్ నిర్వహణ సాగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు ఈ మేరకు దాడులు నిర్వహించారు. సరైన డిగ్రీ లేకుండానే ఆస్థమా, కిడ్నీ స్టోన్స్, క్యాన్సర్ వంటి రోగాలకు మందులు ఇస్తోన్న సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. రోగులకు చికిత్స చేసేందుకు, మందులు సూచించేందుకు సరైన అర్హత లేని విజయ్ స్వామి అనే యువకుడిని అరెస్ట్ చేశారు. ఇతడిని విచారించిన అనంతరం తల్వార్ పరశురామ్, మాస్టర్ భీమ అనే మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. రైడ్ సమయంలో క్లీనిక్ నుంచి చాకచక్యంగా తప్పించుకున్న ఆనంద్ బగల్కోట్ అనే మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులు అందరూ కర్ణాటకకు చెందిన వారేనని తెలుస్తోంది. వీరిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు అప్పగించి, ముఖ్యమైన పత్రాలను, మందులను సీజ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story