Hyderabad : జూ పార్క్ టికెట్లను ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు

హైదరాబాద్ జూపార్క్ టికెట్లను ఇకపై అన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్ లైన్ బుకింగ్ యాప్ తో పాటు, వెబ్ సైట్ ను సోమవారం ప్రారంభించారు. ఈ వెబ్ సైట్ ను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సిజిజి) అభివృద్ధి చేసింది. ఇకపై పౌరులు ఇంటి నుంచే జూ పార్క్ టికెట్లను పొందవచ్చని తెలిపారు. బ్యాటరీ వెహికిల్స్ తో పాటు, సఫారీ టికెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు.
కోవిడ్ -19 కారణంగా కాంటాక్ట్ లెస్ టికెటింగ్ ను సులభతరం చేయడానికి యాప్ మొదటి వెర్షన్ 2020లో తయారు చేశారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో యాప్, వెబ్ సైట్ సేవలను అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఈ కార్యక్రమంలో సీజీజీ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర నిమ్జే, అటవీశాఖ సంయుక్త కార్యదర్శి ప్రశాంతి, జూపార్క్ క్యూరేటర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com