Hyderabad : గో ప్రేమికుల రోజు

Hyderabad :  గో ప్రేమికుల రోజు
గోవులు భారతీయుల సంస్కృతిలో భాగమని.. అలాంటి గోవుల పరిరక్షణ కోసం ర్యాలీ తీస్తుంటే అడ్డుకుంటారా అని మండిపడ్డారు

హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ గోశాల వద్ద 'గో ప్రేమికుల రోజు' కార్యక్రమం చేపట్టారు. అఖిల భారత గోసేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గో ర్యాలీ నిర్వహించేందుకు పిలుపునిచ్చారు.

ఆవులను రక్షించుకుందామంటూ బాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో ర్యాలీకి సిద్ధం అయ్యారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. గోశాలలోనే కార్యక్రమం నిర్వహించుకోవాలని సూచించారు. పోలీసుల తీరుపై గో సేవా ఫౌండేషన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎట్టి పరిస్థితుల్లో గో ర్యాలీ చేస్తామని స్పష్టం చేశారు. ఇక గో సేవా ఫౌండేషన్ నేతలు ర్యాలీకి సిద్ధం కావడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గో సేవా ఫౌండేషన్ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది.

గోవులు భారతీయుల సంస్కృతిలో భాగమని.. అలాంటి గోవుల పరిరక్షణ కోసం ర్యాలీ తీస్తుంటే అడ్డుకుంటారా అని గో సేవా ఫౌండేషన్ నేతలు మండిపడ్డారు. ఇక ఆవులను ఆలింగనం చేసుకుంటే మనలో ఉన్న ఆందోళనలు తొలిగిపోతాయని చెప్పారు. ప్రతీ ఒక్కరూ గోవులను పూజించాలని పిలుపు నిచ్చారు. గోవులను జాతీయ జంతువుగా గుర్తిస్తూ పార్లమెంట్‌లో చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. గోవులు లేకపోతే భవిష్యత్తు లేదన్నారు.

Tags

Next Story