Hyderabad: పట్టాలు తప్పిన రైలు.. ప్రాణభయంతో ప్రయాణికులు

విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ప్రయాణికులు ప్రాణభయంతో ఆహాకారాలు చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌కు కొద్దిదూరంలోని బీబీ నగర్ దగ్గర చోటు చేసుకుంది. పట్టాలు తప్పిన బోగీలను వదిలి ప్రయాణికులతో ఎట్టకేలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. దీంతో ప్రయాణికులు, రైల్వే అధికారులు ఊపరిపీల్చుకున్నారు. ఇక ఘటనా స్థలం వద్ద యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు కొనసాగుతున్నాయి.
ఉదయం బీబీనగర్ వద్ద వందకిలోమీటర్ల వేగంతో వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఆ వేగానికి పట్టాలు తప్పినా కూడా కిలోమీటర్ మేర రైలు ముందుకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ట్రాక్‌పై ఉన్న సిమెంట్ దిమ్మెలు గాల్లోకి ఎగిరిపడ్డాయి. దీంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఆర్త నాదాలు చేశారు. అసలు ఏం అవుతోందో ప్రాణాలతో బయట పడతామో లేదో తెలియక ఆందోళన పడ్డారు. ఈ ప్రమాదంలో ఎలాంటి హానీ జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com