Hyderabad: భాగ్యనగరం పేలుళ్ల కుట్రకేసులో మరొకరి అరెస్ట్

హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర కేసులో NIA మరొకరిని అరెస్ట్ చేసింది. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేసిన పాతబస్తీకి చెందిన అబ్దుల్ ఖలీమ్‌ను అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే జాహిద్‌తో పాటు ఇద్దరిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో నరమేధం సృష్టించేందుకు ముగ్గురు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. జాహిద్‌తో పాటు మరో ఇద్దరిని గతంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. జాహిద్‌కు అబ్దుల్ ఖలీమ్ 40 లక్షలు ఇచ్చాడు. కలీమ్ ఇచ్చిన 40 లక్షలతో జాహిత్.. కార్లు, బైక్‌లు కొన్నాడు. విదేశాల నుంచి వచ్చిన హ్యాండ్ గ్రనేడ్లను కార్లు, బైక్‌లలో పెట్టి పేల్చివేతకు కుట్ర పన్నారు. దసరా ఉత్సవాలతో పాటు హైదరాబాద్‌లో జరిగే ఉత్సవాలపై ఫోకస్ చేశారు. ఐతే గతంలోనే కుట్రను భగ్నం చేసిన పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో ఎన్‌ఐఎ విచారణ జరుపుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com