Hyderabad: కుక్కల దాడిలో బాలుడి మృతి

హైదరాబాద్ అంబర్‌పేటలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని నాలుగేళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం సెలవు కావడంతో తండ్రి పనిచేస్తున్న సర్వీసింగ్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. బాలుడు ఆడుకుంటుండగా తండ్రి పనిలో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలోనే దూరంగా ఉన్న అక్క దగ్గరకు వెళ్లేందుకు బాలుడు ప్రయత్నించాడు. ఆ క్రమంలో వీధికుక్కలు వెంటపడ్డాయి. దీంతో వాటి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశాడు. అయిన వెంటపడ్డ కుక్కల గుంపు బాలుడిపై దాడి చేశాయి. ఆరు కుక్కలు ఒకదాని వెంట మరొకటి బాలుడిని కాటు వేశాయి. దీంతో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన తండ్రి బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే పసివాడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇన్నాళ్లూ అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు ఒక్కసారిగా విగత జీవిగా మారండంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

