Hyderabad: కుక్కల దాడిలో బాలుడి మృతిపై గ్రేటర్‌ యంత్రాంగం అలెర్ట్‌

Hyderabad: కుక్కల దాడిలో బాలుడి మృతిపై గ్రేటర్‌ యంత్రాంగం అలెర్ట్‌
X
బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపిన మంత్రి కేటీఆర్‌

వీధికుక్కల దాడిలో బాలుడి మృతి ఘటనపై ప్రభుత్వం సీరియర్ అయింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో గ్రేటర్ యంత్రాంగం అప్రమత్తమయింది. ఈ నేపథ్యంలో కాసేపట్లో ఉన్నతాధికారులతో మేయర్ గద్వాల విజయలక్ష్మి అత్యవసరంగా సమావేశం కానున్నారు. ఘటనపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మేయర్ విజయలక్ష్మి చర్చించనున్నారు. మరోవైపు ఘటన పట్ల మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు. కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అయినా ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Tags

Next Story