Hyderabad: మట్కాలకు పెరుగుతున్న గిరాకీ...

ఎండాకాలం వస్తోంది అంటే ఓ వైపు మార్కెట్లోకి మట్కాల రాక కూడా మొదలవుతుంది. ముచ్చటగొలిపే మట్టికుండలు దారి పొడువునా బారు తీరుతాయి. అయితే ఈ ఏడాది ఫ్రిబ్రవరీ నుంచే ఎండలు దంచేస్తుండటంతో అప్పుడే మట్టి కుండలకు గిరాకీ పెరిగిపోయింది. మంచి మట్టు కుండల కోసం ఎగబడుతున్న జనంతో మార్కెట్ కళకళలాడుతోంది. మట్టికుండలోని నీళ్లు చల్లాగా ఉండటమే కాక, అందులో ఉన్న నీరు ఆరోగ్యానికి లాభించే సద్గుణాలు సంతరించుకుంటాయని వైద్యులు చెబుతుండటంతో క్రమంగా వీటికి డిమాండ్ పెరుగుతోంది. అయితే మట్టి కుండలు కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. రంగులు వేసిన కుండలు కొనడం వల్ల, రంగుల్లోని రసాయనాలు మంచి నీటిలో కలిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రంగులేయని మట్టి కుండలు అన్ని విధాలా మంచివని సూచిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com