Hyderabad : శంషాబాద్‌లో ల్యాండ్‌ మాఫియా

Hyderabad : శంషాబాద్‌లో ల్యాండ్‌ మాఫియా
500 కోట్లకు పైగా విలువ చేసే HMDA భూముల స్వాహాకు స్కెచ్‌ వేసేశారు

శంషాబాద్‌లో ల్యాండ్‌ మాఫియా రెచ్చిపోతోంది. ఖాళీ జాగా కనిపిస్తే చాలు పాగా వేసేస్తున్నారు భూ బకాసురులు. 500 కోట్లకు పైగా విలువ చేసే HMDA భూముల స్వాహాకు స్కెచ్‌ వేసేశారు. 40 ఏళ్ల క్రితం ట్రక్‌ టర్మినల్‌ ఏర్పాటు కోసం ప్రభుత్వం... రైతుల నుంచి 150 ఎకరాలు సేకరించింది. అయితే అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో 500 కోట్లకుపైగా విలువైన భూములను స్వాహా చేసేందుకు యత్నించారు గుర్తు తెలియని వ్యక్తులు. హెచ్‌ఎండీఏ భూముల్లో రాత్రికి రాత్రి కంచె ఏర్పాటు చేశారు. తప్పుడు పత్రాలు సృష్టించి సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నారు. భూముల సర్వే కోసం HMDA సహా పరిసర ప్రాంతాల్లో...రైతులకు నోటీసులు జారీ చేశారు రెవెన్యూ అధికారులు. అయితే... రైతులు అభ్యంతరం తెలపడంతో.... సర్వేకు నో చెప్పారు రెవెన్యూ అధికారులు. రెవెన్యూ అధికారులు.


శంషాబాద్ వద్ద హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిని అనుకుని ఉన్న 150 ఎకరాల భూములు హెచ్ఎండిఏ కు చెందినవి. 40 ఏళ్ల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ట్రక్ టెర్మినల్ ఏర్పాటు కోసమని రైతుల నుండి ఈ భూములను సేకరించింది. ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించింది. అయితే ట్రక్ టర్మినల్ ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగలేదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ భూములను వేలం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం భావించింది. అయితే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ భూముల వేలం ప్రక్రియకు అభ్యంతరం తెలిపింది. దీంతో ఈ ప్రక్రియ నిలిచి పోయింది. భూములు మాత్రం హెచ్ఎండిఏ ఆధీనంలో ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story