Hyderabad : యువకుడికి ప్రాణం పోసిన ట్రాఫిక్ కానిస్టేబుల్

Hyderabad : యువకుడికి ప్రాణం పోసిన ట్రాఫిక్ కానిస్టేబుల్
స్పృహలోకి రాగానే అతన్ని హుటాహుటిన అత్తాపూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు

నిత్యం వాహనాల రద్దీతో తీరికలేకుండా శ్రమించే ట్రాఫిక్ కానిస్టేబుల్ డాక్టర్ అవతారం ఎత్తారు. ఓ వ్యక్తి గుండెపోటుకు గురై నడిరోడ్డుపై అపస్మారక స్థితిలో ఓ వ్యక్తి పడిపోయాడు.నా కెందుకులే అని అనుకోకుండా ఆ వ్యక్తికి సిపిఆర్ చేసి ప్రాణం పోశాడు ట్రాఫిక్ కానిస్టేబుల్.

మైలార్‌దేవ్‌పల్లి ట్రాఫిక్ పీఎస్‌లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ ఆరాంఘర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నాడు. అదే సమయంలో రోడ్డు దాటుతూ ఓ యువకుడు గుండెపోటుకు గురై పడిపోయాడు. అపస్మారక స్థితికి చేరిన ఆ యువకుడికి రాజశేఖర్ సిపిఆర్ చేసి స్పృహలోకి తెచ్చాడు. స్పృహలోకి రాగానే అతన్ని హుటాహుటిన అత్తాపూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రాజశేఖర్ సమయస్ఫూర్తిని సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, స్థానికులు కొనియాడారు.

Tags

Next Story