Hyderabad: తాగి కారు నడుపుతూ.. నోటికొచ్చినట్లు వాగుతూ..

Hyderabad: తాగడం తప్పు కాదు.. ఎవరి ఇష్టం వారిది.. కానీ తాగి కారు డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్స్ చేస్తుంటారు. అందుకే ట్రాఫిక్ పోలీసులు పహారా కాసి బ్రీత్ ఎన్‌లైజర్లు వాళ్ల నోట్లో పెట్టి తాగిందీ లేంది నిర్ధారిస్తుంటారు. తాగారని తెలిస్తే పనిష్మెంట్ ఇస్తారు. కారుని పక్కన ఆపమని చెప్తారు. బడా బాబులు తిరిగే బంజారాహిల్స్‌లో ఓ యువకుడు మత్తులో వీరంగం సృష్టించాడు. బ్రీత్ అనలైజర్‌లో 94 పాయింట్లు చూపించగా డ్రంక్ అండ్ డ్రైవ్ కింద బుక్ చేయాలనుకున్నారు. కానీ పోలీసులతో యువకుడు వాగ్యుద్ధానికి దిగాడు.. ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి నాకు హైకోర్టు న్యాయమూర్తులు తెలుసు, న్యాయవాదులు తెలుసు అని ప్రగల్భాలు పలికాడు. అరెస్ట్ చేసినా అర నిమిషంలో బయటకు వచ్చేస్తానని ధీమా అతడి ముఖంలో కనిపించింది. నిందితుడు ప్రముఖ ఓటీటీ సంస్థలో పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com