Hyderabad: రుతుక్రమంపై అవగాహన పాఠ్యాంశాల్లో భాగం అవ్వాలి

Hyderabad: రుతుక్రమంపై అవగాహన పాఠ్యాంశాల్లో భాగం అవ్వాలి
హైదరాబాద్‌లో "బిలో ది బెల్ట్" స్క్రీనింగ్ సందర్భంగా నిపుణుల అభిప్రాయం; భారతదేశంలో మొట్టమొదటిసారిగా అవగాహన కార్యక్రమం

ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా తొలిసారిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన “బిలో ది బెల్ట్” చిత్రాన్ని భారతదేశంలో హైదరాబాద్‌లో ప్రదర్శిస్తోంది. ఈ పరిస్థితితో బాధపడుతున్న వేలాది మంది మహిళలకు నిపుణుల సంరక్షణలో వైద్య సహాయాన్ని అందించడానికి అపోలో హాస్పిటల్స్ భాగస్వామ్యంతో ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఎండోమెట్రియోసిస్ అనేది దీర్ఘకాలిక వైద్య పరిస్థితి, దీనిలో గర్భాశయం వెలుపల కటి, ఉదరం, మూత్రాశయం, డయాఫ్రాగమ్, మెదడు వంటి ప్రాంతాల్లో ఎండోమెట్రియల్ కణజాలం పెరుగుతుంది. ఈ రుగ్మత మధుమేహం మాదిరి ప్రబలంగా ఉంటుంది, అంతేకాదు ప్రతి పది మంది మహిళల్లో ఒకరిలో కనిపిస్తుంది. తీవ్రమైన నొప్పి, వంధ్యత్వం, ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. జీవన నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ, సాంప్రదాయ, సామాజిక మాధ్యమాలలో ఎండోమెట్రియోసిస్ పట్టించుకోని పరిస్థితిగా మిగిలిపోయింది,

భారతదేశంలో 25 మిలియన్లకు పైగా మహిళలు ఎండోమెట్రియోసిస్‌తో బాధపడుతున్నారని అంచనా. ఇది మహిళల్లో వంధ్యత్వానికి ప్రధాన కారణం. ఎండోమెట్రియోసిస్ ప్రతి 10 మంది మహిళల్లో 1 మందిని ప్రభావితం చేస్తుంది. 30-50% మంది మహిళల్లో వంధ్యత్వానికి కారణమవుతోంది. అయితే ప్రాధమిక స్థాయి నుంచే పాఠశాలల్లో రుతుక్రమంపై అవగాహన కల్పించడం తక్షణ అవసరమని నిపుణులు అభిప్రాయబడుతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, EPTRI డైరెక్టర్ జనరల్ శ్రీమతి వాణీ ప్రసాద్; ఫ్యూచరిస్టిక్ సిటీస్ వ్యవస్థాపకురాలు శ్రీమతి కరుణా గోపాల్, విద్యావేత్త శ్రీమతి ఉషా రెడ్డి; రైస్ బకెట్ ఛాలెంజ్ వ్యవస్థాపకురాలు, పాత్రికేయురాలు శ్రీమతి మంజులత కళానిది; బిలో ది బెల్ట్ డైరెక్టర్ Ms షానన్ కోన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.





Tags

Read MoreRead Less
Next Story