Hyderabad: నుమాయుష్‌ మిని ఎక్స్‌పో

Hyderabad: నుమాయుష్‌ మిని ఎక్స్‌పో
X
మార్చ్‌ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు సాలార్జంగ్‌ మ్యూజియం వద్ద మినార్‌ గార్డెన్‌లో పాపులర్‌ నుమాయుష్‌ స్టాల్స్‌ వారు ఆరురోజుల ఎక్స్పో

హైదరాబాద్‌ అంటేనే సందడి. ఈ మహానగరంలో నిత్యం పండగ వాతావరణమే ఉంటుంది. కొత్త కొత్త వస్తువులు దేశ, విదేశాల నుంచి వచ్చిన ఉత్పత్తులకే భాగ్యనగరం పెట్టింది పేరు. అలాగే ప్రతి ఏటా కొనసాగే నుమాయుష్‌ ఎగ్జిబీషన్‌ కూడా చాలా ఫేమస్‌. ఈ ఎగ్జీబీషన్‌లో దేశంలోని నలుమూలనుంచి వివిధ రకాల ఉత్పత్తులను, బ్రాండ్‌లను ఇక్కడ అమ్మేస్తుంటారు. 2023 నుమాయుష్‌ ఫిబ్రవరి 15తో ముగిసింది. కానీ ఇది అప్పుడే ముగిసిందనే బాధ చాలమందిలో ఉంది. అయితే నుమాయుష్‌ను మిస్ అయిన వారు వారికి ఇష్టమైన ప్రొడక్ట్స్‌ కొనుగోలు చేయడం కోసం మరో అవకాశం దొరికింది. మార్చ్‌ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు సాలార్జంగ్‌ మ్యూజియం వద్ద మినార్‌ గార్డెన్‌లో పాపులర్‌ నుమాయుష్‌ స్టాల్స్‌ వారు ఆరురోజుల ఎక్స్పో నిర్వహిస్తున్నారు. పూర్తి ఎగ్జిబిషన్‌ను చూడని వారు తమకు కావలసిన ప్రత్యేకమైన ఉత్పత్తులను ఈ ఎక్స్‌పోలో తీసుకోవచ్చు.

Tags

Next Story