Hyderabad : కుషాయిగూడలో ఓ కుటుంబం ఆత్మహత్య

Hyderabad : కుషాయిగూడలో ఓ కుటుంబం ఆత్మహత్య
X

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్‌ నగరంలోని కుషాయిగూడలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు శనివారం తెలిపారు. మృతులను సతీష్, అతని భార్య వేద, వారి ఇద్దరు పిల్లలు నిషికేత్ (9), నిహాల్ (5)గా గుర్తించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగినట్లు అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే శనివారం సాయంత్రం సమాచారం అందిందని చెప్పారు.

కందిగూడ ప్రాంతంలో దంపతులు, వారి ఇద్దరు పిల్లలు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పిల్లలిద్దరూ ఆరోగ్య సంబంధిత సమస్యలతో (మానసికంగా) బాధపడుతున్నారని ప్రాథమిక విచారణలో తేలింది. వారికి చికిత్స అందించినప్పటికీ పిల్లలు కోలుకోలేదు. తల్లిదండ్రులు డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నామని కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి వెంకటేశ్వర్లు తెలిపారు. మృతదేహాలను మార్చురీకి తరలించినట్లు ఆయన తెలిపారు.

Next Story