Hyderabad: మోదీ ఈ ఫ్లైఓవర్‌ ఇంకెన్నేళ్లు కడతారు

Hyderabad: మోదీ ఈ ఫ్లైఓవర్‌ ఇంకెన్నేళ్లు కడతారు
ఐదేళ్లు దాటుతున్నా 40 శాతం పనులు కూడా పూర్తి కాలేదంటూ ఫ్లైఓవర్‌కు పోస్టర్‌లు

హైదరాబాద్‌ ఉప్పల్‌ దగ్గర మోడీ వాల్‌ పోస్టర్లు కలకలం రేగాయి. మోడీ గారు ఈ ఎలివేటెడ్‌ కారిడార్ ఫ్లైఓవర్‌ ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతారు అంటూ పీఎం మోడీ వాల్‌పోస్టర్‌ దర్శనం ఇచ్చాయి. 2018 మే 05న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరి శంకుస్థాపన చేశారని, అయితే ఇప్పటికి ఐదేళ్లు దాటుతున్నా 40 శాతం పనులు కూడా పూర్తి కాలేదంటూ ఫ్లైఓవర్‌కు పోస్టర్‌లు అంటించారు. మేడిపల్లి దగ్గర వెలిసిన ఈ పోస్టర్లు హాట్‌ టాపిక్‌గా మారాయి.

మరోవైపు ఉప్పల్ నుంచి నారపల్లి వరకు 626 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఎలివేటెడ్​కారిడార్ నిర్మించాలని నిర్ణయించారు. 2018లో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన చేశారు.ఈ ఫ్లైఓవర్ రామంతాపూర్ దగ్గర మొదలై నారపల్లి సెంట్రల్​ పవర్‌ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వద్ద ముగుస్తుంది. మొత్తం 148 పిల్లర్లపై 45 మీటర్ల వెడల్పుతో ఆరు లైన్లలో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్లై ఓవర్ పనులు 2022 నాటికి ప్రాజెక్టును పూర్తిచేయాలని టార్గెట్‌ పెట్టుకోగా ఆ స్థాయిలో పనులు జరగలేదు. ఇప్పటికి ఐదేళ్లు పూర్తి కావస్తున్నా పిల్లర్లు వరకు మాత్రమే పూర్తిచేశారు.

Tags

Read MoreRead Less
Next Story