Hyderabad : హైదరాబాద్‌లో వడగళ్ల వాన

Hyderabad : హైదరాబాద్‌లో వడగళ్ల వాన


హైదరాబాద్‌లో వడగళ్ల వాన కురిసింది. అంబర్‌పేట్‌, నల్లకుంట, కాచిగూడ, చిక్కడపల్లి.. నారాయణగూడ ప్రాంతంలో వడగళ్ల వాన పడింది. పలు చోట్ల ఈదురుగాలులతో వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైకి భారీగా వరద వచ్చింది. ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట్ లో కుండపోత వర్షం పడింది. అటు.. దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట, సైదాబాద్‌, సంతోష్‌నగర్‌, చాదర్‌ఘాట్‌, నారాయణగూడ, ముషీరాబాద్‌, హిమాయత్‌నగర్‌లో వర్షం పడింది. దీంతో ఫ్లైఓవర్లు, మెట్రో పిల్లర్ల కిందే నిలిచిపోయారు ద్విచక్ర వాహనదారులు. మరోవైపు హనుమాన్‌ శోభాయాత్రకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది.

Tags

Next Story