Hyderabad: వీడియో గేమ్స్ చూస్తున్నాడని తండ్రి మందలించడంతో 12 ఏళ్ల బాలుడు ఆత్మహత్య..

Hyderabad: వీడియో గేమ్స్ చూస్తున్నాడని తండ్రి మందలించడంతో 12 ఏళ్ల బాలుడు ఆత్మహత్య..
X
కుటుంబ సభ్యులు తమ బంధువు అంత్యక్రియలకు హాజరు కావడానికి వెళ్ళినప్పుడు, బాలుడు ఈ కఠినమైన చర్య తీసుకున్నాడని పోలీసులు తెలిపారు.

స్మార్ట్‌ఫోన్‌లో నిరంతరం వీడియో గేమ్‌లు చూస్తున్నాడని తండ్రి మందలించడంతో 12 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సయ్యద్ నగర్ నివాసి అయిన అఫాన్ ఖాన్ అనే బాలుడు జూబ్లీ హిల్స్ లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు.

అస్తమాను వీడియో గేమ్ లు చూస్తున్నాడని, తండ్రి మందలించాడు.. దాంతో ఆ బాలుడు అవమానంగా ఫీలయ్యాడు. వయసుకు మించి ఆలోచించాడు.. ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తమ బంధువు అంత్యక్రియలకు వెళ్లారు.

ఇంట్లో ఎవరూ లేరు. అదే అవకాశంగా భావించిన ఆ బాలుడు కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. బాలుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Tags

Next Story