Hyderabad: ఇకపై 24గం.లూ అమ్మకాలే అమ్మకాలు...

Hyderabad: ఇకపై 24గం.లూ అమ్మకాలే అమ్మకాలు...
హైదరాబాద్ నగరికి కొత్త హోదా; షాపులు, రెస్టారెంట్ లు ఇకపై అదే పనిలో ఉండవచ్చునట....

అంతర్జాతీయ ప్రమాణాలతో వర్ధిల్లుతోన్న మన భాగ్యనగరికి మరో హోదా దక్కింది. దేశంలో అతి కొద్ది మెట్రోపాలిటిన్ సిటీల్లో మాత్రమే ఆచరణలో ఉన్న 24గంటల వెసులుబాటు ఇప్పుడు హైదరాబాద్ లోనూ అందుబాటులోకి రానుంది. ప్రభుత్వం విడుదల చేసిన తాజా జీవో ప్రకారం హైదరాబాద్ నగరంలో వ్యాపార, వాణిజ్య సముదాయాలు 24గంటలూ తమ కార్యకలాపాలు కొనసాగించవచ్చని వెల్లడైంది. అంటే షాపులు, రెస్టారెంట్ లు 24గంటలూ తమ వినియోగదారులకు సేవలు అందించవచ్చు. ప్రస్తుతం ఈ వెసులుబాటు ముంబైలో మాత్రమే ఆచరణలో ఉంది. తాజా ఉత్తర్వుల్లో ఇప్పటివరకూ ఆచరణలో ఉన్న సెక్షన్ 7(దుకాణాలు, వ్యాపార సముదాయాల తెరిచే, మూసివేసే వేళలు నిర్ణయించే చట్టం)లో మార్పులు తీసుకువచ్చింది. తాజా సెక్షన్ 2(21) ప్రకారం 24గంటలు దుకాణదారులు తమ కార్యకలాపాలు కొనసాగించవచ్చని తేటతెల్లం చేసింది. తాజా చట్టంతో వ్యాపార వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

Tags

Next Story