Hyderabad: బ్లాక్ మెయిల్: జిమ్ ట్రైనర్ కు రూ. 4 లక్షలు ఇచ్చేసిన మైనర్

ఇప్పుడిప్పుడే బయటప్రపంచాన్ని అర్ధం చేసుకునేందుకు రెక్కలు విప్పుకుంటోన్న ఆ పసితనంపై డేగ కళ్లు పడనే పడ్డాయి. స్వేచ్ఛగా ఎగిరిపోలాని తాపత్రయపడుతున్న ఆ చిన్నారిని తన గుప్పెట్లో బంధించాలనుకున్నాడు. బయటపడేందుకు నానాకష్టాలు పడ్డ ఆ బాలిక తిరగబడే సరికి ఖంగుతిన్నాడు. చివరకు చేసిన పాపానికి కటకటాలపాలయ్యాడు.
సికింద్రాబాద్ బోయిన్‌పల్లి పరిధిలో చోటుచేసుకున్న ఈ ఉదతంలో ఓ జిమ్ ట్రైనర్ నిర్వాకం బయపడింది. ఓ మైనర్ బాలికతో సన్నిహితంగా ఉన్నట్లు నటిస్తూ... ఆమె ఫోటోలనే మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు.. రాజు అనే జిమ్ ట్రైనర్.
బాలిక జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా చేస్తుండగా రహస్యంగా ఫోటోలు తీసిన రాజు.. వాటిని మార్ఫింగ్ చేశాడు. డబ్బులు ఇవ్వాలని లేదంటే సోషల్ మీడియాలో ఈ ఫొటోలను పోస్టు చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు.
దీంతో భయపడ్డ బాధిత బాలిక రాజుకు రూ. 4లక్షలతో పాటూ 20 తులాల బంగారం కూడా ఇచ్చింది. అక్కడితో ఆగుతాడు అనుకుంటే ఆ తరువాత వాడి అరాచకం హెచ్చుమీరింది. మళ్లీ వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు బోయిన్ పల్లి పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు రాజును అదుపులోకి తీసుకున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com