Hyderabad: నగరానికి కొత్త పోలీస్ బాస్.. డీజీపీగా అంజనీ కుమార్
Hyedrabad

Hyderabad: నగరానికి కొత్త పోలీస్ బాస్ వచ్చారు. హైదరాబాద్ డైరెక్టర్ జెనరల్ ఆఫ్ పోలీస్ ఇన్ ఛార్జ్ గా అంజనీ కుమార్ నియమితులయ్యారు. డిసెంబర్ 31న ప్రస్తుత డీజీపీ మహేశ్ భగవత్ పదవీ విరమణ నేపథ్యంలో ఆయన స్థానంలోకి అంజనీ కుమార్ రాబోతున్నారు.
1990 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అంజనీ కుమార్ ఇప్పటికే ఎన్నో హోదాల్లో నగర ప్రజలకు సేవలు అందించారు. 2018 నుంచి 2021 వరకూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా విధులు నిర్వహించారు.
మరోవైపు అడిషనల్ డీజీపీగా సేవలు అందిస్తున్న జితేందర్ ను హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక హోం శాఖకు చెందిన రవి గుప్తాను యాంటీ కరప్షన్ బ్యూరోకు డైరెక్టర్ జెనరల్ గా నియమించారు.
ఇక రాచకొంచ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ సీఐడీ విభాగానికి అడిషనల్ డైరెక్టర్ జెనరల్ గా నియమితులయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com