Hyderabad : 'అజా ఫ్యాషన్స్' ప్రారంభోత్సవంలో మిల్కీబ్యూటీ తమన్నా

హైదరాబాద్ లో అజా ఫ్యాషన్స్ షోరూంని ప్రారంభించారు ప్రముఖ పారిశ్రామికవేత్త పింకీ రెడ్డి. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా సినీనటి తమన్నా హాజరయ్యారు. మోడ్రన్ లగ్జరీ సర్వీసులలో అజా ఫ్యాషన్స్ కు పెట్టిందిపేరు. 2005లో ప్రారంభమైన అజా ఫ్యాషన్స్ ప్రస్తుతం భారత్ లో లీడింగ్ ఫ్యాషన్ అధారిటీగా వెలుగొందుతోంది. ముంబై, ఢిల్లీలో ఇప్పటికే స్టోర్లు ఉండగా.. తాజాగా హైదరాబాద్ లో తన ఫ్యాషన్ సామ్రాజ్యాన్ని విస్తరించింది.
అజా వ్యవస్థాపకుడు, చైర్ పర్సన్ డాక్టర్ అల్కా నిషార్, అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించగా... మిల్కీ బ్యూటీ తమన్నా ప్రత్యేకంగా మెరిశారు. ప్రముఖ డిజైనర్లు నుపూర్ కనోయ్, మయూర్ గిరోత్రా, రితికా మిర్చందని, షాహిల్ అనేజా, ధ్రువ్ వెయిష్, శ్రియా సోమ్ ఈ వేడుకకు హాజరయ్యారు.
అల్కా నిషార్ మాట్లాడుతూ... ``బంజారాహిల్స్‌లో అజా స్టోర్‌ను ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. భాగ్యనగరంలో నివసించే స్త్రీ, పురుషుల కోసం డిజైనర్ దుస్తులు, నగలు, యాక్ససరీస్‌తో వన్ స్టాప్ షాపింగ్ స్టోర్‌ని ప్రారంభించాం. దేశవ్యాప్తంగా ఉన్న అత్యంత ప్రతిభావంతులైన డిజైనర్లు రూపొందించిన అత్యద్భుతమైన హస్తకళలను మేం అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ప్రతి సందర్భానికి తగ్గట్టు మా వినియోగదారుల మానసిక ఆనందం కోసం కృషి చేస్తున్నాం`` అని అన్నారు నిషార్. azafshions.com
``హైదరాబాద్‌లో సరికొత్త అజా స్టోర్ ప్రారంభోత్సవానికి వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నన్ను ఆహ్వానించినందుకు డాక్టర్ అల్కా నిషార్, దేవాంగి పరేఖ్‌కు ధన్యవాదాలు. అధునాతనమైన ఈ స్టోర్ హైదరాబాద్‌లోని లగ్జరీ షాపర్‌లకు గొప్ప షాపింగ్ అనుభూతిని కలిగిస్తుంది`` అని అన్నారు తమన్నా భాటియా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com