Hyderabad: బ్యాడ్మింటన్ ఆడుతుండగా ఆగిన గుండె...

X
By - Chitralekha |1 March 2023 2:21 PM IST
లాలాపేటలో విషాదం; బ్యాడ్మింటన్ ఆడుతుండగా స్ట్రోక్ కు గురైన యువకుడు; అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన వైనం...
గుండెపోటుతో యువకులు ఆకాల మరణం నగరవాసులను బెంబేలెత్తిస్తోంది. తాజాగా హైదరాబాద్ లోని లాలాపేటకు చెందిన పరమేశ్ యాదవ్(38) ఉన్నట్లుండి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ప్రొఫెసర్ జయశంకర్ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతున్న పరమేశ్ కు ఆట మధ్యలోనే స్ట్రోక్ కు గురైనట్లు తెలుస్తోంది. నిమిషాల వ్యవధిలోనే అతడు నేలవాలడం, శ్వాసఆగిపోవడం జరిగిపోయాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు వరుస ఘటనలతో ప్రజానీకం బెంబేలెత్తిపోతున్నారు. సరైన ఆరోగ్య నియమాలతో సడన్ స్ట్రోక్ లను నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com