Hyderabad : మెక్ డొనాల్డ్స్ లో చిన్నారిని కరిచిన ఎలుక

Hyderabad : మెక్ డొనాల్డ్స్ లో చిన్నారిని కరిచిన ఎలుక
X
రెస్టారెంట్ వాష్ రూమ్ నుంచి డైనింగ్ ఏరియాలోకి వచ్చిన పెద్ద ఎలుక; సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు

హైదరాబాద్ లోని ఓ ఫాస్ట్ ఫుడ్ అవుట్ లెట్ లో 8 ఏళ్ల బాలుడిని ఎలుకలు కొరికాయి. హైదరాబాద్ కొంపల్లి ప్రాంతంలోని మెక్ డొనాల్డ్స్ కు తన తల్లిదండ్రులతో కలిసి వచ్చాడు ఆ చిన్నారు. ముగ్గురు కూర్చుని ఫుడ్ ను తింటుండగా రెస్టారెంట్ వాష్ రూమ్ నుంచి డైనింగ్ ఏరియాలోకి ఒక పెద్ద ఎలుక వచ్చింది. అక్కడే కూర్చున్న బాలుడిపైకి ఎక్కి అతని తొడలపై కొరికింది. వెంటనే స్పందించిన అతని తండ్రి బాలుడి షాట్స్ నుంచి ఎలుకను విసిరేశాడు. వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. బాలుడికి ఎడమకాలుపై రెండు చోట్ల కుట్లు పడినట్లు డాక్టర్లు తెలిపారు. మార్చి 9 ఈ ఘటన జరిగింది. ఒక రోజు తర్వాత బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags

Next Story