Vaccination Drive: శునకాల కోసం ప్రత్యేకం

హైదరాబాద్ లో హెర్మియోన్ డంకన్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పెట్ వాక్సినేషన్ డ్రైవ్ కు భారీ స్పందన లభించింది. ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ జెండా ఊపి వాక్సినేషన్ డ్రైవ్ ను లాంఛనంగా ప్రారంభించారు. జంతు ప్రేమికులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఇక స్వతహాగా జంతు ప్రేమికురాలైన వరలక్ష్మీ శరత్ కుమార్ హెచ్ఆర్డీఎఫ్ ప్రారంభించిన ఈ కార్యక్రమంపై ప్రశంసలు కురిపించారు. ప్రతి ప్రాణి పట్ల ప్రేమ కలిగి ఉండటం గొప్ప విషయమని కొనియాడారు. ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ వల్ల ఎన్నో జంతువులకు మేలు జరుగుతుందని తెలిపారు. మరో మూడు రోజుల్లో సుమారు 5వేల శునకాలకు వాక్సినేషన్ వేయించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు హెచ్ఆర్డీఎఫ్ వ్యవస్థాపకురాలు డాక్టర్ శ్రీరెడ్డి తెలిపారు. మున్సిపల్ అధికారులతో పాటూ, సహృదయుల సహకారంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు నగరంలో ఏ మూల నుంచి విన్నపాలు అందుకున్నా వెంటనే స్పందించి వాక్సినేషన్ అందించేందుకు రెండు వ్యాన్ లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశన్ని సద్వినియోగంచేసుకుని వాక్సినేషన్ కోసం 9100873829 కు కాల్ చేయాల్సిందిగా సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com