Hyderabad: అమ్నేషియా పబ్ కేసు వ్యవహారం మరో మలుపు.. ఓ ఎమ్మెల్యే కుమారుడు కూడా..

Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్ కేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. బాలికపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. తనపై అత్యాచారం జరిగిందంటూ బాలిక స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది. గత నెల 28న స్నేహితుడు సూరజ్‌తో కలిసి అమ్నేషియా పబ్‌లో పార్టీకి వెళ్లింది బాలిక. అప్పటికే సూరజ్ స్నేహితుడు హాది పబ్‌లో ఉన్నాడు.
పార్టీ ముగిసిన తర్వాత తిరిగి వచ్చే సమయంలో తానంతట తాను వెళ్లిపోతానని బాలిక చెప్పినా వినిపించుకోని హాది, సూరజ్ బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు బాలికతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె కేకలు పెట్టేందుకు యత్నించగా సూరజ్, హాదిలతో పాటు మరో యువకుడు బెంజ్ కారును అక్కడే ఉంచి.. ఇన్నోవా కారులో బలవంతంగా కూర్చొబెట్టుకుని పబ్ వద్దకు తీసుకువచ్చి వదిలి వెళ్లారు.
ఇంటికి వెళ్లిన బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు హాది, సూరజ్‌లతో పాటు మరో ముగ్గురు యువకులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పబ్ నుంచి వెళ్లిన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో ఆ కారులో ఓ ఎమ్మెల్యే కుమారుడు ఉన్నట్లు తేలింది. అక్కడే వదిలేసిన బెంజ్ కారును తీసుకువచ్చి సీజ్ చేశారు. అయితే.. పబ్‌లోకి బాలికను ఎలా అనుమతించారనే దానిపై ఆరా తీస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com