Hyderabad: నువ్వు ముస్లింవా.. అయితే నన్ను పెళ్లి చేసుకో.. మహిళా కస్టమర్ తో క్యాబ్ డ్రైవర్..

Hyderabad: నువ్వు ముస్లింవా.. అయితే నన్ను పెళ్లి చేసుకో.. మహిళా కస్టమర్ తో క్యాబ్ డ్రైవర్..
X
హైదరాబాద్‌కు చెందిన ఒక యువతి సోషల్ మీడియా పోస్ట్ లో క్యాబ్ డ్రైవర్ తనతో అనుచితంగా ప్రవర్తించిన తీరును పంచుకుంది.

హైదరాబాద్‌కు చెందిన ఒక యువతి సోషల్ మీడియా పోస్ట్ లో క్యాబ్ డ్రైవర్ తనతో అనుచితంగా ప్రవర్తించిన తీరును పంచుకుంది. X పోస్ట్‌లో, రైడ్ సమయంలో తనకు ఎదురైన భయానక అనుభవాన్ని ఆమె వివరించింది.

ఆ మహిళ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో ఒక స్నేహితురాలి పుట్టినరోజు వేడుకకు వెళ్లింది. పార్టీ తర్వాత, మణికొండలోని తన ఇంటికి తిరిగి రావడానికి ఆమె క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్ లో ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్ "మీరు ముస్లింనా?" అని అడిగినప్పుడు ఆమె గుండె జారి పోయింది. ఎందుకు ఇలా అడుగుతున్నాడు అని మనసులో అనుకుంది. అప్రయత్నంగానే ఆమె "అవును" అని సమాధానం ఇచ్చింది, ఆపై డ్రైవర్ "మీరు చాలా అందంగా ఉన్నారు, మేడమ్" అని వ్యాఖ్యానించాడు. దాంతో అమె దానిని హానిచేయని పొగడ్తగా భావించి, మర్యాదగా నవ్వి, తన స్నేహితులు వాట్సాప్‌లో పంపిన పుట్టినరోజు ఫోటోలను చూడటం కొనసాగించింది.

కానీ, డ్రైవర్ అకస్మాత్తుగా సాధారణ మార్గం నుండి తప్పుకుని టోలిచౌకి వైపు వెళ్లడంతో కొంచెం కంగారు పడింది. కానీ ఆమె అది కేవలం ఒక షార్ట్‌కట్ అని భావించి వెంటనే స్పందించలేదు. సరిగ్గా అదే సమయంలో డ్రైవర్ ఒక షాకింగ్ వ్యాఖ్య చేశాడు: “మేడమ్, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.” అని అతను కొనసాగించాడు, “ప్లీజ్ మేడమ్... మీరంటే నాకు ఇష్టం” అని అన్నాడు.

దాంతో ఆ మహిళ ఆశ్చర్యపోయింది, ముఖ్యంగా డ్రైవర్ ఆమెను తెలియని వీధుల గుండా తీసుకెళ్తూ, "ఇది నా ప్రాంతం. నువ్వు ఇక్కడి నుండి వెనక్కి వెళ్ళలేవు" అని చెప్పి బెదిరించాడు.

స్నేహితుడు పోలీసులకు ఫోన్ చేశాడు

వెంటనే స్పందించిన ఆ మహిళ తన లైవ్ లొకేషన్‌ను తన స్నేహితులతో పంచుకుని వెంటనే పోలీసులను సంప్రదించింది. అదృష్టవశాత్తూ, ఆమె స్నేహితుల్లో ఒకరు న్యూస్ ఛానెల్‌లో పనిచేస్తున్నారు. ఈ సమస్యను అధికారులకు చేరవేయడంలో సహాయపడ్డారు. పోలీసులు వాహనాన్ని ట్రాక్ చేసి వెంటనే ఆమెను గుర్తించగలిగారు. వారు ఆమెను కారు డ్రైవర్ నుండి సురక్షితంగా రక్షించగలిగారు.

డ్రైవర్‌ షేక్ ముజ్జహీద్‌గా గుర్తించారు, అతను బర్మాకు చెందినవాడు అని గత ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్‌లో నివసిస్తున్నాడని పోలీసుల ఎంక్వైరీలో తేలింది.

తదుపరి పోస్ట్‌లో, అక్రమ వలసదారులు రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీలను ఉపయోగించి కొత్త క్యాబ్‌లు మరియు ఆటోలను కొనుగోలు చేస్తున్నారని ఆ మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ డ్రైవర్ల వల్ల మహిళలు ప్రమాదంలో ఉన్నారని, వారు ఇల్లు మరియు కార్యాలయ చిరునామాలు వంటి వ్యక్తిగత వివరాలను సులభంగా తెలుసుకోగలరని, దీని వలన ప్రజలను అపహరించడం సులభం అవుతుందని ఆమె హెచ్చరించింది. "ఇది చాలా భయానకంగా ఉంది" అని ఆమె అన్నారు.

ఈ పోస్ట్‌పై తీవ్ర స్పందనలు వచ్చాయి, చాలామంది ఆమె భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేయగా, మరికొందరు క్యాబ్ సేవలకు కఠినమైన నిబంధనలు అమలు చేయాలని పిలుపునిచ్చారు.

Tags

Next Story