నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్.. !

తన ఆటోలో మరిచిపోయిన బ్యాగ్ ను తిరిగిచ్చి నిజాయతీ చాటుకున్నాడు హైదరాబాదుకి చెందిన ఓ ఆటో డ్రైవర్.. వివరాల్లోకి వెళ్తే.. రఫీ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి అంబర్‌పేట్‌కు ఓ ఫంక్షన్‌కు వచ్చాడు. ఆ తర్వాత తిరిగి చార్మినార్‌కు వెళ్లే క్రమంలో ఆటో ఎక్కాడు.. అయితే ఆ ఆటోలో బ్యాగ్ ను మరిచిపోయాడు.
ఆ బ్యాగులో 3 తులాల బంగారం, రూ. 5వేల నగదు ఉండడంతో... వెంటనే రఫీ అంబర్పేట్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. విచారణలో భాగంగా పోలీసులు సీసీటీవీ కెమెరా ద్వారా ఆటోను గుర్తించి ఆ అటో డ్రైవర్ కి ఫోన్ చేశారు.
అప్పటికే స్పందించిన డ్రైవర్.. ఆటోలో మరిచిపోయిన బ్యాగ్ ని అంబర్పేట్ పోలీస్‌స్టేషన్‌లో బాధితులకు అప్పగించాడు. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్‌ను అభినందించి బహుమతిగా రెండు వేల రూపాయలు ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com