Hyderabad Bonalu : రేపటి నుంచి హైదరాబాద్‌లో ఆషాఢమాసం బోనాలు..!

Hyderabad Bonalu : రేపటి నుంచి హైదరాబాద్‌లో ఆషాఢమాసం బోనాలు..!
X
Hyderabad Bonalu : బోనం ఎత్తేందుకు భాగ్యనగరం సిద్ధమైంది. రేపటి నుంచి హైదరాబాద్‌లో ఆషాఢమాసం బోనాలు షురూ కానున్నాయి.

Hyderabad Bonalu : బోనం ఎత్తేందుకు భాగ్యనగరం సిద్ధమైంది. రేపటి నుంచి హైదరాబాద్‌లో ఆషాఢమాసం బోనాలు షురూ కానున్నాయి. గోల్కొండ జగదాంబిక మహంకాళీ అమ్మవారి తొట్టెల ఊరేగింపుతో బోనాల సందడి మొదలు కానుంది. జూలై 11 నుంచి ఆగస్ట్‌ 8 వరకూ నెల రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. జూలై 25, 26 తేదీల్లో సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి బోనాలు, ఆగస్టు 1,2 తేదీల్లో ఒల్డ్‌సిటీ లాల్‌ దర్వాజా మహంకాళీ అమ్మవారి బోనాలు జరగనున్నాయి.. ఇక ఆగస్ట్‌ 8న గోల్కొండలోనే ఉత్సవాలు ముగియనున్నాయి. ఇప్పటికే బోనాల ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం 15కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఆదివారం గోల్కొండ అమ్మవారికి మంత్రి తలసాని, ఇంద్రకరణ్‌ రెడ్డిలు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

Tags

Next Story