పోలీసులకు దిగ్విజయ్ అడ్రస్ తెలియదా?: కోర్టు

కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్‌నేత దిగ్విజయ్‌సింగ్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ సమన్లు అందించడంలో జాప్యంపై హైదరాబాద్‌లోని ప్రజాప్రతినిధుల కోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేసింది. కేంద్ర మాజీమంత్రి అడ్రస్ తెలుసుకోలేరా అని ప్రశ్నించింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌పై దిగ్విజయ్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ మజ్లిస్ నేత అన్వర్... పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు దిగ్విజయ్ హాజరు కాకపోవడంతో... ఫిబ్రవరి 22న దిగ్విజయ్‌పై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వారెంట్‌కు సంబంధించిన సమన్లు ఇవ్వలేదని పోలీసులు కోర్టుకు తెలిపారు. పిటిషనర్ పేర్కొన్న అడ్రస్‌లో దిగ్విజయ్ లేరని చెప్పారు. దిగ్విజయ్ అడ్రస్, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణ సెప్టెంబరు 3కు వాయిదా వేసింది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com