Hyderabad : ప్యాంట్ విప్పేసి మందుబాబు హల్‌చల్

Hyderabad : ఫుల్లుగా మందు కొట్టాడు. తర్వాత బారు నుంచి బైక్ ఎక్కి ఇంటికి బయలుదేరాడు. దారిలో డ్రంకెన్ డ్రైవ్‌లో పోలీసులోళ్లకు దొరికేశాడు. చేసిన తప్పుకు సైలెంట్ అయ్యి.. బుద్ధిగా చేతులు కట్టుకుని పోలీసుల ముందు నుంచుంటే సరిపోయేది. వాళ్లు ఓ కేసు రాసేవారు. తర్వాత జరగాల్సింది జరిగేది. కానీ.. మైకం తలకెక్కిన కిక్కులో ఆ తాగుబోతు నోటికి పనిచెప్పాడు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు.
అక్కడితో ఆగలేదు. ఉన్నట్టుండి ప్యాంట్ విప్పేసి నిరసనకు దిగాడు. రోడ్డుపైనే బైఠాయించాడు. ఎంత అరాచకం చేయాలో అంతా చేశాడు. ఓ స్టేజ్ వరకూ ఓపికపట్టి చూసిన పోలీసులు.. తర్వాత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దెబ్బకు ఫ్యూచర్ గొర్తొచ్చి.. దారికొచ్చాడు. ఇదంతా జరిగింది హైదరాబాద్ పాతబస్తీలోని మీర్‌చౌక్‌లో.
నిన్న రాత్రి సైదాబాద్ భారత్ గార్డెన్ ముందు పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పట్టుబడిన తాగుబోతు ఇలా హల్‌చల్ చేసి పరువు పోగొట్టుకున్నాడు. రెండ్రోజుల క్రితం మలక్‌పేటలో ఓ దివ్యాంగుడు కూడా ఇలాగే పోలీసులకు చికాకు తెప్పించాడు. ఇప్పుడు ఈ మందుబాబు ప్యాంట్ విప్పేసి రోడ్డుపై బైఠాయించి నానా హంగామా చేసి.. చిర్రెత్తుకొచ్చేలా చేశాడు…..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com