కొడుకు చదవట్లేదని టర్పెంటాయిల్ పోసి నిప్పు పెట్టిన తండ్రి

చదువుకోమని ఎన్ని సార్లు తండ్రి మందలించినా అదే వరస. ఆయన బయటికి వెళ్లగానే ఫోన్‌లో వీడియో గేమ్స్‌తో కాలక్షేపం. బడికి వెళితే కనీసం టీచర్లయినా పట్టించుకుంటారు. కరోనా కష్టంతో ఇంట్లోనే ఆన్‌లైన్ చదువులు. అమ్మానాన్న పట్టించుకోపోతే ఆటల్లో పడతారు. వచ్చిన నాలుగు అక్షరాలు కూడా మర్చిపోతారు. ఆ భయంతో చదువుని అశ్రద్ధ చేస్తున్న కొడుకుపై కోపంతో రగిలిపోయాడో తండ్రి.. అంతే ఆగ్రహంతో అక్కడే ఉన్న టర్పెంటాయిల్ తీసుకువచ్చి కొడుకు మీద గుమ్మరించి నిప్పంటించాడు.
ఈ ఘటన హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో చోటు చేసుకుంది. స్థానిక గవర్నమెంట్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల చరణ్ ఎన్నిసార్లు చెప్పినా చదువుకోకుండా టీవీ చూస్తూ, వీడియో గేమ్‌లు ఆడుతూ టైమ్ వేస్ట్ చేస్తున్నాడు. దీంతో తండ్రి ఆగ్రంహంతో ఊగిపోయాడు. ఇంట్లో ఉన్న టర్పెంటాయిల్ చరణ్‌పై పోసి నిప్పంటించాడు. ఈ ఘటనతో బాలుడికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు గమనించి చరణ్‌ని హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో చరణ్ చికిత్స పొందుతున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com