Hyderabad : Formula E రేసుకు FIA అధ్యక్షుడు

Hyderabad : Formula E రేసుకు FIA అధ్యక్షుడు
గ్రీన్ కో - తెలంగాణ ప్రభుత్వం కలిసి రేసును నిర్వహిస్తుంది. 2.83 కిమీ పొడవు గల స్ట్రీమ్ సర్క్యూట్ ను సిద్దం చేస్తున్నారు


భారతదేశంలో మొదటి FIA ప్రపంచ చాంపియన్ షిప్ - స్టేటస్ ఈవెంట్ జరుగనుంది. ఈ రేస్ కు FIA అధ్యక్షుడు మహమ్మద్ సులేయం వస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 11న హైదరాబాద్ లో Formula - E రేస్ జరుగనుంది. డిసెంబర్ 2021లో జీన్ టోడ్ నుండి FIA పగ్గాలను చేపట్టారు బిన్ సులేయం. ఫిబ్రవరిలో జరుగనున్న ఆల్ ఎలక్ట్రిక్ రేస్ కు సులేయెమ్ హాజరవనున్నట్లు సమాచారం.


గ్రీన్ కో - తెలంగాణ ప్రభుత్వం కలిసి రేసును నిర్వహిస్తుంది. 2.83 కిమీ పొడవు గల స్ట్రీమ్ సర్క్యూట్ ను సిద్దం చేస్తున్నారు. ట్రాక్ చుట్టూ శాశ్వతంగా ఉండే విధంగా టీమ్ గ్యారేజీలకు తుది మెరుగులు దిద్దనున్నారు. Formula - E అనేది 2013 లో ఫార్ములా 1 ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ తర్వాత భారతదేశంలో జరుగుతున్న మొదటి FIA ప్రపంచ ఛాంపియన్ షిప్ స్టేటస్ ఈవెంట్.

Tags

Read MoreRead Less
Next Story