కోవిడ్ చికిత్సకు రూ.5 లక్షల బిల్లు.. కోర్టులో కేసు వేయడంతో..

కోవిడ్ చికిత్సకు రూ.5 లక్షల బిల్లు.. కోర్టులో కేసు వేయడంతో..
ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాలంటేనే సామాన్యుడికి గుండెల్లో దడ.. అవసరం ఉన్నా టెస్టుల పేరుతో చాంతాడంత బిల్లు వేస్తారు.

Hyderabad: ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాలంటేనే సామాన్యుడికి గుండెల్లో దడ.. అవసరం ఉన్నా టెస్టుల పేరుతో చాంతాడంత బిల్లు వేస్తారు. ఇక ట్రీట్‌మెంట్‌కి అయితే సరేసరి. ఇదంతా కలిపి తడిసి మోపెడైంది. దీంతో అతడు వినియోగదారుల ఫోరమ్‌లో ఫిర్యాదు చేశాడు. కోర్టు ఆస్పత్రి యాజమాన్యంపై కొరడా ఝుళిపించింది. వినియోగ దారుడికి నష్టపరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది.

నగరానికి చెందిన నూర్జహాన్ కోవిడ్ కారణంగా ఏప్రిల్ 25, 2021లో ఇంటెగ్రో హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందుతోంది. ఫార్మసీ ఛార్జీలు, ల్యాబ్ పరీక్షలు మినహా ట్రిపుల్ షేరింగ్ రూమ్ కోసం రోజుకు రూ.30వేలు వసూలు చేశారు. ఐసీయూకు రోజుకు రూ.60వేలు వసూలు చేశారు. చికిత్స పూర్తయిందని మే 6న డిశ్చార్జ్ చేసి రూ.5,11677 బిల్లు వేసి నూర్జహాన్ చేతిలో పెట్టారు. జూన్ 15న తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ చికిత్సకు సంబంధించి ఛార్జీలను నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె కుమారుడి అంగీకారం మేరకే చికిత్స చేశామని ఆస్పత్రి యాజమాన్యం వాదించింది. ఈ మేరకు వినియోగదారుల ఫోరమ్ ఆస్పత్రికి నోటిసులు జారీ చేసింది. పేషెంట్ తాలూకు కుటుంబసభ్యులకు బిల్లు చెల్లించిన దాంట్లో నుంచి తిరిగి 9% చెల్లించాలని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story