Hyderabad Metro: మెట్రో బంపరాఫర్.. రూ.59లతో హ్యాపీగా రోజంతా..

Hyderabad Metro: మెట్రో బంపరాఫర్.. రూ.59లతో హ్యాపీగా రోజంతా..
X
Hyderabad Metro: అయితే ఈ ఆఫర్ మెట్రో వర్గాలు ప్రకటించిన సెలవు దినాల్లో మాత్రమే వర్తిస్తుంది

Hyderabad Metro: నగరంలోకి మెట్రో వచ్చి ప్రయాణీకుడికి ట్రాఫిక్ కష్టాలనుంచి విముక్తి చేసింది.. మెట్రో ఎక్కితే సమయం కూడా ఆదా అవుతుంది.. తాజాగా హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు ఓ బంపరాఫర్ ప్రకటించింది. సూపర్ సేవర్ కార్డు పేరుతో కొత్త ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది.

మెట్రో ఎండీ కెవిబి రెడ్డి ఈ కార్డును ప్రారంభించారు. ఈ కార్డుతో కేవలం రూ.59 లతో రోజంతా మెట్రోలో ప్రయాణం చేయవచ్చు. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగొచ్చు. అయితే ఈ ఆఫర్ మెట్రో వర్గాలు ప్రకటించిన సెలవు దినాల్లో మాత్రమే వర్తిస్తుంది అని కెవిబి రెడ్డి వివరించారు.

మెట్రో ప్రకటించిన సెలవులు ఈ విధంగా..

ప్రతి ఆదివారం, ప్రతి రెండు, నాలుగో శనివారాలు, ఉగాది, రంజాన్, మొహర్రం, బోనాలు, ఆగస్ట్ 15, వినాయకచవితి, కృష్ణాష్టమి, దుర్గాష్టమి, దసరా, దీపావళి, బాక్సింగ్ డే, సంక్రాంతి, శివరాత్రి రోజుల్లో ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఆ రోజుల్లో రూ.59 లతో ఎక్కడికైనా వెళ్లి రావచ్చు.

Tags

Next Story