TG: పెరగనున్న మెట్రో ఛార్జీలు.. ఎంతంటే.. ?

హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరగనున్న విషయం తెలిసిందే. ఈనెల రెండో వారం నుంచి ఛార్జీల పెంపు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని మెట్రో వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఉన్న ధరలపై రూ.5 పెరగనున్నట్లు తెలుస్తోంది. పెంపు ద్వారా రూ.150 కోట్ల వరకు రాబట్టుకునేలా ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ కసరత్తు చేస్తోంది. ఛార్జీలు పెంచబోతున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. ప్రస్తుతం మెట్రోలో కనిష్ఠ టికెట్ రూ.10, గరిష్ఠ టికెట్ రూ.60 ఉంది. గరిష్ఠం రూ.75 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. మెట్రో ఆపరేషన్స్, మాల్స్ అద్దెలు, ప్రకటనల ద్వారా ఏటా రూ.1500 కోట్ల వరకు ఆదాయం మెట్రోకు సమకూరుతోంది. మెట్రో నిర్వహణ, బ్యాంకు రుణాలపై వడ్డీ చెల్లింపులు తదితర ఖర్చులన్నీ కలిపి రూ.2 వేల కోట్ల వరకు వ్యయం అవుతోందని హైదరాబాద్ మెట్రో వర్గాలు చెబుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com