Hyderabad : MMTS ట్రైన్ రెండో దశను ప్రారంభించనున్న పీఎం మోదీ

గ్రేటర్ వాసులకు ఓ గుడ్ న్యూస్. మరి కొన్ని రోజుల్లో నగరంలోని ఏ ప్రాంతం నుంచి మేడ్చల్ వెళ్లాలన్నా.. మేడ్చల్ నుంచి ఏ మూలకైనా వెళ్లడానికి ఇక కష్టపడనక్కర్లేదు. ఎందుకంటే ఎంఎంటీఎస్ రెండో దశ కూత పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. లక్షలాది ప్రజల సంవత్సరాల నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది. ఎంఎంటీఎస్ ఎక్కి 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం కూడా కేవలం పది పదిహేను రూపాయల టిక్కెట్‌తో ప్రయాణించవచ్చు.
ఈ నెల 8న ప్రధానమంత్రి ఎంఎంటీఎస్ రెండోదశను లాంఛనంగా ప్రారంభించి మేడ్చల్-సికింద్రాబాద్-ఉందానగర్,మేడ్చల్-సికింద్రాబాద్-తెల్లాపూర్ ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సికింద్రాబాద్ డీఆర్‌ఎం తెలిపారు. మేడ్చల్-ఉందానగర్ 55 కిలోమీటర్ల దూరం ఉంది. మేడ్చల్ వైపు నుంచి వచ్చేవారు గతంలో సికింద్రాబాద్‌కు వచ్చి అక్కడి నుంచి ఎంఎంటీఎస్‌లో వెళ్తుండేవారు. మేడ్చల్ నుంచి లింగంపల్లికి 52 కిలోమీటర్ల ప్రయాణానికి రెండు, మూడు గంటలు పట్టేది. ఇప్పుడు ఎంఎంటీఎస్ రెండోదశలో భాగంగా ఎంఎంటీఎస్ రైళ్లు పరుగులు పెడితే కేవలం గంటలోచేరుకోవచ్చు. మేడ్చల్-తెల్లాపూర్ మధ్య సికింద్రాబాద్ మీదుగా రైళ్లు నడిపించాల్సి ఉంది.అలాగే మేడ్చల్-ఉందానగర్ మధ్య సికింద్రాబాద్ మీదుగా కొనసాగాల్సి ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com