Hyderabad: లైసెన్స్ లేకుండా దగ్గు మందు తయారీ.. వాడొద్దని హెచ్చరించిన అధికారులు

Hyderabad: లైసెన్స్ లేకుండా దగ్గు మందు తయారీ.. వాడొద్దని హెచ్చరించిన అధికారులు
X
దగ్గు, జలుబు చాలా చిన్న చిన్న వ్యాధుల్లా కనిపిస్తాయి మనకు. అందుకే హాస్పిటల్ కు వెళ్లకుండా దగ్గరలో ఉన్న మెడికల్ షాపుకు వెళ్లి దగ్గు సిరప్ తెచ్చుకుని వాడేస్తుంటాం.

దగ్గు, జలుబు చాలా చిన్న చిన్న వ్యాధుల్లా కనిపిస్తాయి మనకు. అందుకే హాస్పిటల్ కు వెళ్లకుండా దగ్గరలో ఉన్న మెడికల్ షాపుకు వెళ్లి దగ్గు సిరప్ తెచ్చుకుని వాడేస్తుంటాం.

ప్రజల ఆరోగ్యంతో ఆడలాడుతుంటారు. సంపాదనే పరమావధిగా బతుకుతుంటారు. అందుకోసం ఎన్ని అడ్డదారులు తొక్కడానికైనా వెనుకాడరు. పెద్దవారి నుంచి చిన్నారుల వరకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దగ్గు మందు తెచ్చుకుని వాడేస్తుంటాం. అలాంటి దగ్గు మందు కల్తీది అని తెలిస్తే, ప్రాణాలు హరిస్తుందని తెలిస్తే వెన్నులో వణుకు పుడుతుంది.

లైసెన్స్ లేకుండా దగ్గు మందు తయారు చేస్తున్న కంపెనీపై అధికారులు రైడ్స్ చేశారు. హైదరాబాద్ కూకట్ పల్లిలో అఖిల్ లైఫ్ సైన్సెస్ అనే కంపెనీ గ్లైకోరిల్ కాఫ్ సిరప్ ను తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. క్వాలిటీ స్టాండర్డ్స్ లేని ఈ సిరప్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని, వినియోగించవద్దని హెచ్చరించారు.

Tags

Next Story